🚆 పండుగకు ఇంటికెళ్లాలంటే ఇంత కష్టమా?.. రైల్వే స్టేషన్లు, రైళ్లలో కిక్కిరిసిన జనం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పండుగ అంటే కుటుంబంతో కలిసే ఆనందం. కానీ ఆ ఆనందం కోసం ఇంటికి బయలుదేరిన ప్రయాణికులకు రైల్వే స్టేషన్లు, రైళ్లలో భారీ రద్దీ పరీక్షగా మారుతోంది.
కొన్ని చోట్ల ప్లాట్‌ఫామ్‌పై నిలబడేందుకు కూడా చోటు లేకపోగా.. మరికొన్ని రైళ్లలో లోపల అడుగు పెట్టడమే కష్టంగా మారిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
“పండుగకు ఇంటికెళ్లడం ప్రతి ఒక్కరి కోరికే.. కానీ సురక్షితంగా, కనీస సౌకర్యాలతో ప్రయాణించడం కూడా హక్కే కదా?” అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
పండుగల సమయంలో ముందుగానే అదనపు రైళ్లు, ఎక్స్‌ట్రా కోచ్‌లు, మెరుగైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను కోరుతున్నారు.





