🚨 ప్రియుడితో కలిసి భర్త హత్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తీసుకెళ్లి పడేసిన భార్య!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం తండాలో దారుణ ఘటన వెలుగుచూసింది.
అజ్మీరా చందును అతడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ కలిసి ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
హత్య అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తీసుకెళ్లి చిక్నేపల్లి సమీపంలో రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పావని, సంతోష్ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తాజా సమాచారం.





