తిరుపతి: టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్‌గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రమాణ స్వీకారం.

తిరుమల శ్రీవారి ఆలయం లోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో ఈఓ చేత ప్రమాణం చేయించిన
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి.
రంగనాయకుల మండపంలో
చైర్మన్ కు వేదపండితులు వేదాశీర్వచనం.
శ్రీవారి తీర్థప్రసాదాలు అందించిన అడిషనల్ ఈవో.
దేవుని సేవ చేసేందుకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు.
టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగామెరుగ్గా కొనసాగించడమే లక్ష్యం.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కల్పించాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది.
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం.
తిరుమల శ్రీవారి ఆలయం తో పాటు టీటీడీ నిర్వహిస్తున్న ఇతర 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్య ను అందిస్తాము.
సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.
టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాల్లో రోగులకు ఆధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందిస్తాం.
భక్తులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్య, వైద్య రంగాల్లోనూ మరింత విస్తృతంగా సేవలందించాలన్న సంకల్పంతో పనిచేస్తాం.
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ముద్దాడ రవిచంద్ర.





