🚨 అనుమానం పెనుభూతమై.. భార్యను కుర్చీకి కట్టి నిప్పంటించిన భర్త.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా జగత్‌పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
భార్య సోనమ్‌కు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో, భర్త సుఖ్‌వీర్ సింగ్ అలియాస్ మోను ఆమెను కుర్చీకి కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.
మంటల్లో చిక్కుకున్న సోనమ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన అనంతరం నిందితుడు ఇద్దరు పిల్లలను తీసుకుని పరారైనట్లు సమాచారం.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.





