‘ఎగ్ డొనేషన్’ రాకెట్‌లో కొత్త కోణాలు.. హార్మోన్ ఇంజెక్షన్లపై FSL రిపోర్టే కీలకం: CP సుమతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో వెలుగుచూసిన అక్రమ అండాల సేకరణ వ్యవహారంపై దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది.
తొలుత వ్యభిచార సంబంధిత వ్యవహారంగా భావించి విచారణ చేపట్టగా.. మహిళల నుంచి అండాలు సేకరించే నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానాలు బయటపడ్డాయని పోలీస్ కమిషనర్ బి. సుమతి తెలిపారు.
మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలు సేకరించారా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోందని, స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లపై FSL నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
ART సెంటర్లు, ఫెర్టిలిటీ సెంటర్ల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆధారాలు లభించిన వారి పాత్రపైనే చర్యలు ఉంటాయని CP స్పష్టం చేశారు.





