మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి సహకరించాలి

భారత ఎన్నికల సంఘం మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి నూతన ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఫారం-18 ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు 28.09.2026, 15.10.2026 మరియు 25.10.2026 తేదీలలో బహిరంగ నోటీసులు జారీ చేయడం జరిగింది.
ఫారం-18 ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించేందుకు నియమించబడిన అధికారులు మరియు బూత్ స్థాయి అధికారులు (BLOలు) సంబంధిత దరఖాస్తుదారులు అందించిన చిరునామాలో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించేందుకు అధికారం కలిగి ఉన్నారు.
అయితే, కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు మరియు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లోకి బూత్ స్థాయి అధికారులు మరియు సంబంధిత అధికారులను అనుమతించకపోవడం వల్ల క్షేత్రస్థాయి పరిశీలనకు ఆటంకం కలుగుతున్నట్లు హైదరాబాద్ జిల్లా జిల్లా ఎన్నికల అధికారి మరియు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలో, గేటెడ్ కమ్యూనిటీలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు మరియు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల యాజమాన్యాలు, సంబంధిత అధికారులను మరియు పర్యవేక్షక అధికారులను తమ ప్రాంగణాల్లోకి అనుమతించి, ఫారం-18 దరఖాస్తుల ధృవీకరణకు సహకరించాలని కోరడమైనది.
అలాగే, మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసేందుకు ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జీహెచ్‌ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.





