చంద్రగిరిలో చెవిరెడ్డికి సుధారెడ్డి వార్నింగ్, నాన్సెన్స్ చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
🔥 “నాన్సెన్స్ క్రియేట్ చేస్తే.. నీకు నాకు డైరెక్ట్ ఉద్యమమే” — చెవిరెడ్డికి సుధారెడ్డి సూటి హెచ్చరిక
చంద్రగిరి పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి.
చెవిరెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ వెళ్తుండగా ఆయనను ఫాలో అయిన సుధారెడ్డి.. “ఈ రోజు అంతా నీ వెంటే ఉంటా.. నాన్సెన్స్ క్రియేట్ చేస్తే నీకు నాకు డైరెక్ట్ ఉద్యమమే” అంటూ హెచ్చరించారు. ప్రశాంతంగా పోలింగ్ జరగాలని, అనవసర ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వొద్దని చెప్పారు.
ఇద్దరూ ఎదురెదురుగా నిలిచిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





