🔥 “నువ్వు మేనేజ్‌మెంట్ కోటా.. మేము మెరిట్ కోటా” — KTRకు బండి సంజయ్ కౌంటర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, అమిత్ షా మహాపాదయాత్రలో బండి సంజయ్ జనాన్ని అదుపు చేస్తున్న దృశ్యాలను ప్రస్తావిస్తూ ఆయనను “బౌన్సర్” అంటూ విమర్శించారు.
దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ X వేదికగా స్పందిస్తూ,
“నువ్వు మేనేజ్‌మెంట్ కోటా రాజకీయ నాయకుడు.. మేము మెరిట్ కోటా. నేను గోడలు పెయింట్ చేసి, జెండాలు కట్టి, లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొని ఇక్కడికి వచ్చాను” అంటూ KTRపై విమర్శలు చేశారు.
అమిత్ షా పాదయాత్రలో స్టాంపీడ్ జరగకుండా జనాన్ని నియంత్రించడమే తన బాధ్యతగా చేశానని, దాన్ని “బౌన్సర్ పని”గా చూడడం సరికాదని బండి సంజయ్ పేర్కొన్నారు.
“మీరు దాన్ని బౌన్సర్ పని అంటారు.. నేను దాన్ని నా ధర్మంగా భావిస్తాను” అంటూ గీతా శ్లోకాన్ని కూడా తన పోస్టులో ప్రస్తావించారు.





