రాప్తాడు చిన్నారి ఆరోగ్యంపై గుడ్ న్యూస్.. ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతం: నారా లోకేష్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్యంపై మంత్రి నారా లోకేష్ తాజా అప్‌డేట్ ఇచ్చారు.
చిన్నారికి ప్లాన్ చేసిన ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ఆపరేషన్ థియేటర్‌లోనే ప్లాస్టిక్ సర్జరీ వైద్యుల బృందం కూడా ఆమెను పరీక్షించినట్లు తెలిపారు.
ప్రస్తుతం చిన్నారిని తిరిగి PICUకు తరలించారని, ఆమె సౌకర్యంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అందేలా వైద్య బృందంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అంతకుముందు చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉండి, మాట్లాడటం ప్రారంభించిందని కూడా ఆయన వెల్లడించారు.





