🚨 ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ పోలీస్ స్టేషన్‌లోకి సీఎం విజయ్.. ఆకస్మిక తనిఖీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ కోయంబత్తూరు జిల్లా కరుమత్తంపట్టి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈరోడ్ జిల్లా పెరుందురైలో ప్రభుత్వ కార్యక్రమం ముగించుకుని కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
స్టేషన్‌లోని ఫిర్యాదుల నమోదు, కేసుల స్థితి, రికార్డులు, లాక్‌అప్‌ను పరిశీలించిన సీఎం, మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.





