తెలుగు ఎడిషన్ · 3 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
తిరుమలలో దట్టమైన పొగమంచు.. ఘాట్ రోడ్లలో సప్తగిరి బస్సులుజగ్గయ్యపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా వినీత విజయంనంద్యాల జిల్లా: బేతంచెర్ల లో హై టెన్షన్ఒంగోలు వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ పొన్నూరు రైల్వే స్టేషన్ లో తెల్లవారుజామునజీడిమెట్లలో పారిశుధ్య కార్మికుల ధర్నా.. “కొత్త నియామకాలకు లక్ష వసూలు” అంటూ ఆరోపణలు🚨 ఎరువుల వ్యాపారం సాఫీగా సాగాలంటే లంచం?.. రూ.20 వేలు తీసుకుంటూ ACBకి చిక్కిన వ్యవసాయ అధికారినెల్లూరులో కూటమి హవావిజయవాడలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2:30 గంటల వరకు ప్రారంభం కాకపోవచ్చు.తిరుమలలో దట్టమైన పొగమంచు.. ఘాట్ రోడ్లలో సప్తగిరి బస్సులుజగ్గయ్యపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా వినీత విజయంనంద్యాల జిల్లా: బేతంచెర్ల లో హై టెన్షన్ఒంగోలు వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ పొన్నూరు రైల్వే స్టేషన్ లో తెల్లవారుజామునజీడిమెట్లలో పారిశుధ్య కార్మికుల ధర్నా.. “కొత్త నియామకాలకు లక్ష వసూలు” అంటూ ఆరోపణలు🚨 ఎరువుల వ్యాపారం సాఫీగా సాగాలంటే లంచం?.. రూ.20 వేలు తీసుకుంటూ ACBకి చిక్కిన వ్యవసాయ అధికారినెల్లూరులో కూటమి హవావిజయవాడలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2:30 గంటల వరకు ప్రారంభం కాకపోవచ్చు.
వాతావరణం
📅 తేదీ వారీగా

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా వినీత విజయం

ప్రత్యేక కథనంజాతీయం
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా వినీత విజయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా కూటమి అభ్యర్థి నరేంద్రుల వినీత గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిని హాఫిజున్నిసాపై ఆమె 15వేల 210 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 36 వార్డులకు గాను 12 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 24 వార్డుల కౌంటింగ్‌లో టీడీపీ 14, జనసేన 5, వైసీపీ 3 గెలుచుకోగా.. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

7వ వార్డు పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

విజయవాడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 7వ వార్డుకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో టీడీపీకి 16 ఓట్లు, కాంగ్రెస్‌కు 7 ఓట్లు పోలయ్యాయి. ఒక స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు రాగా.. టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

14వ వార్డు పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ లీడ్

విజయవాడ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 14వ వార్డు పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ అభ్యర్థి 10 ఓట్లు సాధించారు. వైసీపీకి మూడు ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు పడింది. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు.

49వ వార్డు పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ముందంజ

విజయవాడ 49వ వార్డు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో నిలిచింది. ఇక్కడ బీజేపీకి ఐదు ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు ఒక ఓటు పోలైంది. స్వతంత్ర అభ్యర్థులకు మూడు ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. 41వ వార్డులో వైసీపీ అభ్యర్థి అనీల్ విజయం సాధించగా.. తన డిక్లరేషన్ ఫామ్‌ను టీడీపీ నేతలు చించేశారని ఆయన ఆరోపించారు. ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రంలో అధికారులను ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ ప్రభావితం చేస్తున్నారని.. వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

అనంతపురం కార్పొరేషన్‌లో పోటాపోటీ

అనంతపురం కార్పొరేషన్‌లో వైసీపీ, కూటమి మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 15 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. 16 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించినట్లు వెల్లడైంది.

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూటమి జోరు

ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్నికల్లో కూటమి జోరు కొనసాగుతోంది. జగ్గయ్యపేట, ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకుంది. పెడనలో జనసేన అభ్యర్థి బళ్ల జ్యోత్స్న రాణి, జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి నరేంద్రుల వినీత, ఉయ్యూరులో చెదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ గెలుపొందారు. కొండపల్లి, తిరువూరు, నందిగామలో కూడా కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు.

అమలాపురంలో జనసేన అభ్యర్థి ముందంజ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు