జీడిమెట్లలో పారిశుధ్య కార్మికుల ధర్నా.. “కొత్త నియామకాలకు లక్ష వసూలు” అంటూ ఆరోపణలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ జీడిమెట్ల సర్కిల్‌లో పారిశుధ్య కార్మికులు విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు.
కొత్త శానిటేషన్ వర్కర్ల నియామకాల్లో ఒక్కొక్కరి నుంచి రూ.1 లక్ష వసూలు చేస్తున్నారని, అలాగే పాత కార్మికులను వేధిస్తున్నారని వారు అధికారులపై ఆరోపించారు.
సూపర్‌వైజర్ శివరామకృష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్ల శుభ్రత పనులను నిలిపివేశారు.
విషయంపై స్పందించిన శానిటేషన్ DEE, సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.





