🚨 ఎరువుల వ్యాపారం సాఫీగా సాగాలంటే లంచం?.. రూ.20 వేలు తీసుకుంటూ ACBకి చిక్కిన వ్యవసాయ అధికారి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్‌ను రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఎరువుల వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటే రూ.30 వేలు ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు ACB తెలిపింది.
ఇందులో అక్టోబర్ 19న రూ.10 వేలు తీసుకున్నారని, మిగిలిన రూ.20 వేలు నవంబర్ 3న స్వీకరిస్తుండగా ACB పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిందితుడిని హైదరాబాద్‌లోని ACB ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
📞 లంచం డిమాండ్ చేస్తే ACB టోల్ ఫ్రీ: 1064





