🚨 త్రిపురలో BSF జవాన్లపై గుంపు దాడి.. ముగ్గురికి గాయాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
త్రిపురలోని సెపాహిజాలా జిల్లా ఆషాబరి ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ స్థానికుడిపై BSF సిబ్బంది దాడి చేశారన్న ఆరోపణలతో గ్రామస్థులు ఆషాబరి–రహీంపూర్ రోడ్డుపై నిరసనకు దిగారు.
ఈ సమయంలో అక్కడికి వచ్చిన BSF 49వ బెటాలియన్ వాహనాన్ని కొందరు నిరసనకారులు చుట్టుముట్టి కర్రలు, వెదురు కర్రలతో దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో BSF అధికారి సహా ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. అనంతరం పోలీసులు, అదనపు BSF బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి.
ఘటనపై ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందగా దర్యాప్తు కొనసాగుతోంది.





