ఒంగోలును వణికించిన ‘మురసు’.. బలమైన గాలులకు భయానకంగా మారిన పరిస్థితి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తీవ్ర తుఫాన్ ‘మురసు’ ఒంగోలు సమీపంలో తీరం దాటిన తర్వాత కూడా ప్రకాశం జిల్లాలో బలమైన గాలుల ప్రభావం కొనసాగుతోంది.
ల్యాండ్‌ఫాల్ సమయంలో గంటకు 100–110 కి.మీ వేగంతో గాలులు వీచగా, గరిష్ఠంగా 120 కి.మీ వరకు నమోదైనట్లు IMD తెలిపింది.
ఒంగోలులో భారీగా వీచుతున్న గాలుల దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తుఫాన్ ప్రస్తుతం లోపలికి కదులుతూ క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ, కొన్ని గంటలపాటు బలమైన గాలులు, వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.





