సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ

ఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి ప్రతీకాత్మక ప్రజా అభిశంసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పించే వరకు మా పోరాటం ఆగదు
ఎన్నికల వ్యవస్థపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
జ్ఞానేశ్ కుమార్ ఒక్కరే కాదు.. ఈ వ్యవహారంలో ఇంకా చాలామంది ఉన్నారు
రాజ్యాంగాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు పోరాడుతాం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసనతో పాటు దేశద్రోహం కేసు విచారణ కూడా జరగాలి
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, వారి ఆదేశాలను అమలు చేస్తున్న వారే మా తొలి లక్ష్యం
పదవులు, సంస్థల రక్షణ వెనుక దాక్కుని ఎవరూ తప్పించుకోలేరు
ఎన్నికల సంఘం దుర్వినియోగం, సీబీఐ, ఈడీ వంటి సంస్థల దుర్వినియోగాన్ని సహించేది లేదు
ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమే.. ప్రజాస్వామ్య శక్తుల పోరాటం కొనసాగుతుంది
జ్ఞానేశ్ కుమార్‌పై మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి.. ఆయన సీఈసీగా కొనసాగలేరు
ఆయనను బీజేపీ కొనసాగిస్తే ఆ పార్టీ ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతుంది
ఇది కేవలం ఎంపీలు, సామాన్య పౌరుల సమావేశం కాదు..
ప్రజాస్వామ్యాన్ని కాపాడే రాజకీయ ఆయుధం
ఓటర్ల హక్కులను హరించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ప్రజాప్రతినిధుల ముందు సమాధానం చెప్పుకోవాల్సిందే
దేశవ్యాప్తంగా 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారు.
ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరి ఓటు హక్కు తొలగించారు
దేశంలోని మొత్తం ఓటర్లలో 15 శాతం మంది పేర్లు తొలగించారు
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓటర్లు ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెబుతోంది
గత లోక్‌సభ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమే
15 శాతం మంది ఓటర్లకు ఓటు హక్కు ఉండకూడదని ఇప్పుడు ఎన్నికల సంఘం చెబుతోంది
2024 లోక్‌సభ ఎన్నికల చట్టబద్ధతపైనే ఎన్నికల సంఘం ప్రశ్నలు లేవనెత్తినట్లుంది
బీజేపీ ఎంపీలు అక్రమంగా గెలిచి లోక్‌సభలోకి ప్రవేశించారు





