ఎలుకల రెట్టలు.. బొద్దింకలు.. పాడైన ఆహారం.. షా గౌస్, మెహఫిల్ సహా హైదరాబాద్‌లో 14 రెస్టారెంట్ల..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎలుకల రెట్టలు.. బొద్దింకలు.. పాడైన ఆహారం.. షా గౌస్, మెహఫిల్ సహా హైదరాబాద్‌లో 14 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్!
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 22 రెస్టారెంట్లను పరిశీలించి, 14 రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేశారు.
ఈ జాబితాలో షా గౌస్–శాలిబండ, నయాబ్–నయాపూల్, మెహఫిల్–దిల్‌సుఖ్‌నగర్, సొహైల్–మలక్‌పేట్ తదితర రెస్టారెంట్లు ఉన్నాయి.
తనిఖీల్లో పలు చోట్ల ఎలుకల రెట్టలు, బొద్దింకలు, ఈగలు, పాడైన కూరగాయలు, ఫంగస్ పట్టిన ఆహారం, గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రంగా నిల్వ చేసిన మాంసం గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 544 కిలోల పాడైన, కలుషిత ఆహార పదార్థాలను తొలగించారు.
అలాగే తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, పిస్తా హౌస్, హోటల్ గోల్కొండ సహా 8 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.





