తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
“HYDRAA ఎఫెక్ట్.. మాదాపూర్ తమ్మిడికుంటలోకి పరుగులు తీస్తున్న వర్షపు నీరు!”🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలనస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటుతెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పుతెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మొయినాబాద్‌లో భారీ వర్షం.. చిలుకూరు బాలాజీ రోడ్డు జలమయంనాలాలో కొట్టుకుపోయిన Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్.. క్షణాల్లో కాపాడిన పోలీసులు, HYDRAAవిజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎండీ కోన శశిధర్..“HYDRAA ఎఫెక్ట్.. మాదాపూర్ తమ్మిడికుంటలోకి పరుగులు తీస్తున్న వర్షపు నీరు!”🌴 కాన్వాయ్ ఆపి కొబ్బరి తోటలోకి సీఎం చంద్రబాబు.. రైతుతో మాట్లాడి నష్టం పరిశీలనస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటుతెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పుతెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మొయినాబాద్‌లో భారీ వర్షం.. చిలుకూరు బాలాజీ రోడ్డు జలమయంనాలాలో కొట్టుకుపోయిన Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్.. క్షణాల్లో కాపాడిన పోలీసులు, HYDRAAవిజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎండీ కోన శశిధర్..
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పు

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణలో రోజుకు 15 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, యువతలో పెరుగుతున్న ముప్పు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

20 ఏళ్ల నుండి 45 ఏళ్ల యువత లో పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు : తెలంగాణలో రోజుకు 15 కేసులు!

వయసుతో సంబంధం లేకుండా ప్రాణాంతకంగా మారుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. గతంలో వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు తక్కువ వయసు వారిలోనూ బయటపడుతోంది. 20 ఏళ్ల నుండి 45 ఏళ్లలోపు వారిలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వయసు వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు స్ట్రోక్‌కు గురవుతున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. అధిక రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు ఈ ప్రమాదానికి దారితీసే ముఖ్య కారణాలుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో స్ట్రోక్ బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో 108 అంబులెన్స్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈఎంఆర్‌ఐ) అధ్యయనం ప్రకారం.. 2025లో 108 సేవల పరిధిలోకి వచ్చిన స్ట్రోక్ అత్యవసర కేసులు 5,298. అంటే రోజుకు సగటున 15 మంది ఈ సమస్యతో ఆసుపత్రులకు చేరాల్సి వచ్చింది. బాధితుల్లో మహిళలతో పోలిస్తే పురుషుల వాటా ఎక్కువగా ఉంది. స్ట్రోక్ కేసుల నమోదులో జిల్లాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. కరీంనగర్‌లో అత్యధికంగా 319 కేసులు నమోదు కాగా, ఖమ్మం 279 కేసులతో, రంగారెడ్డి 264 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌లో 51 కేసులు, వికారాబాద్‌లో 55, నారాయణపేటలో 57 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో బాధితులు ఎక్కువగా ఉండే అవకాశమున్నప్పటికీ, 108 గణాంకాల్లో ఆ స్థాయి సంఖ్య కనిపించకపోవడానికి ప్రైవేట్ అంబులెన్స్‌ల వినియోగం కూడా ఒక కారణమై ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈఎంఆర్‌ఐ సేకరించిన వివరాల ప్రకారం.. మొత్తం బాధితుల్లో 3,356 మంది పురుషులు కాగా, 1,942 మంది మహిళలు ఉన్నారు. వీరిలో పురుషులు 63.35 శాతం, మహిళలు 36.65 శాతంగా ఉన్నారు. బాధితుల సగటు వయస్సు 59 సంవత్సరాలుగా నమోదైంది. 60 ఏళ్లు దాటిన వారు మొత్తం కేసుల్లో 43 శాతం ఉన్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో స్ట్రోక్ అత్యవసర కేసుల సంఖ్య అధికంగా ఉంది. నమోదైన కేసుల్లో 3,780 పట్టణ ప్రాంతాలకు చెందినవి. గ్రామీణ ప్రాంతాల నుంచి 1,191 కేసులు రాగా, గిరిజన ప్రాంతాల నుంచి 327 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సగటున 160 కేసులు నమోదైనట్లు అధ్యయనం వెల్లడించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు