తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాంసైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనమేము చేసే పోరాటానికి అమిత్ షా మద్దతు ఇస్తున్నారుఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!కబ్జాలపై స్పెషల్ ఎంక్వైరీ దర్యాప్తుభూకబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తాం
వాతావరణం
📅 తేదీ వారీగా

₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో జిరాక్స్ షాప్ ముసుగులో నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేస్తున్న వ్యవహారం బయటపడింది.

ఆధార్, పాన్ కార్డుల్లో పేర్లు, ఫొటోలు, పుట్టిన తేదీలు, చిరునామాలను అక్రమంగా మార్చుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆధార్‌లో పుట్టిన తేదీ మార్చేందుకు ₹300, పూర్తి వివరాల మార్పునకు ₹700 నుంచి ₹1,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ నకిలీ పత్రాలను ఉద్యోగాలు, సిమ్ కార్డులు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో జిరాక్స్ షాప్ నిర్వాహకుడు సీహెచ్. మహాదేవ్ (36)ను టాస్క్‌ఫోర్స్, శంషాబాద్ జోన్ బృందం అరెస్ట్ చేసింది. పూర్తి నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.

Public Alert:

ఆధార్ మార్పులు అధికారిక UIDAI మార్గాల్లోనే చేయించుకోండి.. ఇలాంటి నకిలీ సేవలకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు