ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా.. 5 రాష్ట్రాల్లో 24 చోట్ల ఏకకాల సోదాలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
Omega Hospitalsపై ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లోని మొత్తం 24 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ Investigation Wing ఆధ్వర్యంలో ఆస్పత్రి బ్రాంచీలు, కార్యాలయాలతో పాటు కీలక వైద్యులకు సంబంధించిన ప్రదేశాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
తనిఖీల్లో ఆర్థిక లావాదేవీల రికార్డులు, డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను చెల్లింపులు, నగదు లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఐటీ శాఖ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
సోదాలు ఇంకా కొనసాగుతున్నందున ఎంత నగదు లేదా ఇతర ఆస్తులు స్వాధీనం అయ్యాయి, ఏవైనా పన్ను ఉల్లంఘనలు నిర్ధారణ అయ్యాయా అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతుంది.





