పిల్లి, కుక్క స్నేహం చేస్తూ ఎంతో ముచ్చటగా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇంట్లో కలిసి మెలిసి ఉంటున్న మూగజీవాలు..
సాధారణంగా పిల్లి, కుక్క మధ్య వైరం ఉంటుందని భావిస్తారు. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని బండి సుబ్రహ్మణ్య నగర్‌లో నివాసం ఉంటున్న మౌలాలి ఇంట్లో పిల్లి, కుక్క స్నేహంగా ఉంటూ స్థానికుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇంట్లోని ఈ రెండు జంతువులు కలిసి ఆడుకుంటూ, ఒకదానితో మరొకటి కలిసిమెలిసి ఉండటం చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటోంది. సాధారణంగా సహజ శత్రువులుగా భావించే కొన్ని జంతువులు సైతం ఒకే చోట స్నేహంగా ఉండటం అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది.





