నా బిడ్డ పెళ్లికి రండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వైఎస్ షర్మిల ఆహ్వానం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ప్రజాభవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులను కలిశారు. ఈ సందర్భంగా వారు ఆత్మీయంగా పలకరించుకుని, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
తన కుమార్తె వివాహానికి తప్పక హాజరుకావాలని కోరుతూ భట్టి విక్రమార్క దంపతులకు వై.ఎస్. షర్మిల పెళ్లి శుభలేఖతో పాటు బహుమతిని అందజేశారు. అనిల్ కుమార్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.





