బుడమేరు కాలువలో వ్యర్థాల తొలగింపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నబ్ తుపాను ముప్పుతో విజయవాడ యంత్రాంగం అప్రమత్తమైంది. వరద నీరు సజావుగా వెళ్లేందుకు బుడమేరు కాలువలో వ్యర్థాల తొలగింపు చర్యలు చేపట్టారు. రాజరాజేశ్వరి పేట, నందమూరి నగర్ వద్ద కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్క మొక్కలను క్షేత్రస్థాయిలో తొలగిస్తున్నారు. భారీ వర్షాలు కురిసినా ముంపు ముప్పు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.





