తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో రెండు, మూడు గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వర్ష సూచన ఉందంది. జనగామ, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది.





