కోనసీమలో నిలిచిపోయిన కమ్యూనికేషన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావంతో కమ్యూనికేషన్ నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు రోడ్లపై పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన చెట్ల తొలగింపు పనులు చేయిస్తున్నారు. అమలాపురం, అంబాజీపేట, అల్లవరం, పి.గన్నవరం మండలాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది.





