తహసీల్దార్ కార్యాలయంపై పడిన భారీ వృక్షం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పశ్చిమగోదావరి జిల్లా తణుకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు వేళ్లతో సహా పెకలించుకుపోయి భవనంపై పడటంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో చెట్టుతో పాటు సీసీ రోడ్డు సైతం పైకి లేచిపోవడం స్థానికులను భయపెట్టింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.





