జైలు నుంచి 17 మంది పరారీ.. డ్రోన్లతో వేట, 13 మంది మళ్లీ కటకటాల్లోకి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమిళనాడులోని తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారవడం కలకలం రేపింది.
ఖైదీల పరారీతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.
సౌత్ జోన్ ఐజీ విజయేంద్ర బిదారీ పర్యవేక్షణలో ఇప్పటివరకు 13 మంది ఖైదీలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న మిగతా ఖైదీల కోసం గాలింపు కొనసాగుతుండగా, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.





