స్థానిక ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండం కాదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలను రెఫరెండంగా చూడటం లేదు.. అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా.
2024లో రాష్ట్రాన్ని కాపాడాలనే లక్ష్యంతో మూడు పార్టీలు కలిసి పనిచేశాయి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లోనూ ఐక్యంగా ముందుకు వెళ్తున్నాం.
సంక్షేమంతో పాటు అభివృద్ధి, పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీలో పెట్టుబడులకు స్థిరత్వం, నమ్మకమే ప్రధాన కారణాలు.
టీడీపీకి నాలుగున్నర దశాబ్దాల సంస్థాగత బలం ఉంది. జనసేన పార్టీ బలోపేతానికి మరింత సమయం పడుతుంది.. ఇది సుదీర్ఘ ప్రయాణం.
మూడు పార్టీల బలాలను, అనుభవాలను గుర్తించి సీట్ల సర్దుబాటు చేశాం. సీట్ల కేటాయింపులో కూటమి స్ఫూర్తికి భంగం కలగకుండా జాగ్రత్తపడ్డాం. కార్యకర్తల ఒత్తిడి ఉన్నా కూటమి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాం.
కూటమి అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సహకరించాలి. రెబల్స్ లేకుండా మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలి. కూటమి నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి స్వతంత్రంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.
ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కూటమి లక్ష్యం.





