సూరారంలో క్షుద్ర పూజల కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రామాయపల్లి సర్పంచ్ భర్త మహేందర్ తన కుమారుడు, మరి కొంత మందితో కలిసి క్షుద్ర పూజలు చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. పూజలు నిర్వహిస్తున్న మొత్తం 9 మందిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.





