సుప్రీంకోర్టులో ఏపీ మున్సిపల్ ఎన్నికల కేసు విచారణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు అడ్డుకోవడంపై వైఎస్ఆర్సిపి వేసిన పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. నామినేషన్ గడువు పొడిగింపు, ప్రత్యామ్నాయ కేంద్రాల ఏర్పాటుపై గత విచారణలో ఎస్‌ఈసీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అంశాన్ని నేడు కోర్టు దృష్టికి వైసీపీ తీసుకెళ్లనుంది. కోర్టు ఆదేశాలపై తీసుకున్న చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరించనుంది.





