తుపాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అతి తీవ్ర తుపాను అర్నబ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని హోం మంత్రి అనిత తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయని.. తీర ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 1070, 112 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు.





