బూరాడ జంక్షన్‌లో కొండచిలువ కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ జంక్షన్ దగ్గర పది అడుగుల కొండచిలువ హల్ చల్ చేసింది. మెయిన్ రోడ్డుపై భారీ కొండచిలువ సంచరించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రోడ్డు దాటిన కొండచిలువ పక్కనే ఉన్న పశువుల పాకలోకి ప్రవేశించింది. స్నేక్ క్యాచర్ సాయంతో స్థానికులు దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.





