75 ఏళ్ల మహిళ ఇంట్లో గంజాయి రాకెట్.. 66 మందికి THC పాజిటివ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ఫతేనగర్‌లో గంజాయి విక్రయాల రాకెట్‌ను EAGLE Force ఛేదించింది. LBS నగర్‌లోని ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసిన అధికారులు 75 ఏళ్ల షేక్ జాతెన్ బీబీని అదుపులోకి తీసుకున్నారు.
ఆమె వద్ద నుంచి 41 చిన్న ప్యాకెట్లలో 179.1 గ్రాముల గంజాయి, ₹43,340 నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
దాడి సమయంలో అక్కడికి వస్తున్న 70 మంది అనుమానిత గంజాయి వినియోగదారులను గుర్తించి పరీక్షించగా, 66 మందికి THC పాజిటివ్ వచ్చినట్లు EAGLE Force తెలిపింది. వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
ఈ రాకెట్‌కు సంబంధించిన మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Drug Info Helpline: 1908





