తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా ఉన్న అర్నబ్.. రానున్న 12 గంటల్లో అతి తీవ్రతుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లుండి ఉదయానికి బాపట్ల–విశాఖ మధ్య యానాం సమీపంలో ఇది తీరం దాటనుందని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం 27 కోట్ల నిధులతో పాటు.. 8 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది.





