నల్లజర్లలో 3ఎఫ్ ఆయిల్ పామ్ పరిశ్రమ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో 224 కోట్లతో 3ఎఫ్ ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. దీనిద్వారా 750 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల గోదావరి ప్రాంతంలోని వేలాది మంది రైతులకు ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి పెట్టుబడులు తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు.





