అర్నబ్ తుపాను సహాయక చర్యలకు నిధులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం 20 జిల్లాలకు 27 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రెండు కోట్ల చొప్పున కేటాయించారు. శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్ సహా మరో 13 జిల్లాలకు కోటి రూపాయల చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.





