అమెరికాలో ఖమ్మం యువతి అక్షిత నల్లమల మృతి

అమెరికాలోని అల్బానీలో ఖమ్మంకు చెందిన అక్షిత నల్లమల గుండెపోటుతో మరణించారు. అక్షిత తన ఇంటి సమీపంలో నడుస్తుండగా ఈ ఘటన జరిగింది.
అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి సమీపంలో నడుస్తుండగా అక్షిత కుప్పకూలిపోయారు.
తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. బయటకు వచ్చిన సోదరుడు అక్షయ్ ఆమె స్పృహ తప్పి పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆమెను ఆసుపత్రికి తరలించగా, గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
నాలుగేళ్ల క్రితం మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన అక్షిత, ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అల్బానీలో సోదరుడు అక్షయ్‌తో కలిసి ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు.
ఖమ్మం వ్యాపారుల సంఘం దిగుమతి విభాగం అధ్యక్షుడు నల్లమల ఆనంద్ కుమార్తె అక్షిత.
ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మంకు చెందిన 26 ఏళ్ల అక్షిత నల్లమల అల్బానీలో మృతి.





