రైల్వే ఉద్యోగులకు 78 రోజుల PLB బోనస్కు కేబినెట్ ఆమోదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రైల్వే ఉద్యోగులకు పండుగ కానుకగా 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్కు (Productivity Linked Bonus - PLB) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా 11,40,770 మంది అర్హులైన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ఈ ఉత్పాదకత ఆధారిత బోనస్ (PLB) అందనుంది.
అర్హులైన ప్రతి ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 లభించనుంది.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.2,009.61 కోట్లు వెచ్చించనుంది.
పండుగ సీజన్లో రైల్వే సిబ్బందికి ఈ నిర్ణయం భారీ ఆర్థిక ఊరటనిచ్చింది.





