హైదరాబాద్-విజయవాడ హైవే హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. షాకింగ్ నిజాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
కొయ్యలగూడెం నుంచి కోదాడ మధ్య టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు.
చిట్యాల శివారులోని మిడ్‌వే ప్లాజా హోటల్‌లో పురుగులు పట్టిన లూజ్ పచ్చ పెసరపప్పు గుర్తింపు..
హోటళ్ల స్టోర్‌రూముల్లో బొద్దింకలు, ఎలుకల సంచారం.. సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయని మాంసాహారం, డెయిరీ ఉత్పత్తులు.
నిన్న వండిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించిన అధికారులు..
గడువు ముగిసిన FSSAI లైసెన్స్‌తో నడుస్తున్న పలు హోటళ్లు..
పరీక్షల కోసం శాంపిల్స్ సేకరణ.. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని హోటళ్లను మూసివేయించి, మరికొన్నింటికి షోకాజ్, ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ.
నిబంధనలు పాటించని హైవే హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా





