తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఉప్పల్ స్టేడియంహైదరాబాద్-విజయవాడ హైవే హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. షాకింగ్ నిజాలుఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ విప్విశాఖలోని హోటళ్లు, రెస్టారెంట్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!చిట్యాల 7 మిడ్‌వే ప్లాజాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. విస్తుపోయే నిజాలుహై కోర్ట్ వద్ద బిజెపి నేతల నిరసననగరంలో స్కూటీలు దొంగతనం చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులుఉప్పల్ స్టేడియంహైదరాబాద్-విజయవాడ హైవే హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. షాకింగ్ నిజాలుఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ విప్విశాఖలోని హోటళ్లు, రెస్టారెంట్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు📲 యూపీఐ వ్యాపార చెల్లింపులపై MDR.. దీపావళి తర్వాతే అమలు!చిట్యాల 7 మిడ్‌వే ప్లాజాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. విస్తుపోయే నిజాలుహై కోర్ట్ వద్ద బిజెపి నేతల నిరసననగరంలో స్కూటీలు దొంగతనం చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ విప్

ప్రత్యేక కథనంజాతీయం
ఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ విప్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.

ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో ప్రతిపక్షాల గొంతుకలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.

SIR ప్రక్రియ పేరుతో కోట్లాది ఓట్ల తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

దేశ జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది? 13 కోట్లకు పైగా ఓట్ల తొలగింపునకు కారణాలేంటి?

మరణించిన వారి ఓట్ల తొలగింపు పేరుతో మిగిలిన ఓట్ల తొలగింపును సమర్థించలేరు.

అర్హులైన ఓటర్ల ఓటు హక్కును కాపాడాలి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి.

తాతలు, తండ్రులు ఎక్కడ ఓటు వేశారనే అంశాలతో నేటి ఓటర్లను ఇబ్బంది పెట్టడం సరికాదు.

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ విజయవంతమైంది.

తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ర్యాలీ విజయవంతం కావడంతోనే బీజేపీ నాయకులు విమర్శలకు దిగుతున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు..

పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులకు రాజకీయ పదవులు కల్పించే అంశంపై ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలకు సమాధానం చెప్పాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి.

తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలి.

ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకూడదు. ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెంచాలి.

జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై సమాధానం చెప్పాలి. ఆయనను పదవి నుంచి తొలగించాలన్నది మా ప్రధాన డిమాండ్.

ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరగకుండా చూడాలి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకూడదు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది.

ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి పునాది. అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగించే ప్రయత్నాలను సహించేది లేదు.

ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం...

X లో చూడండి ›

సంబంధిత వార్తలు