నగరంలో స్కూటీలు దొంగతనం చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు

Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్
గుంటూరు నగర పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాలు దొంగిలించబడుతున్నాని ఫిర్యాదులు వచ్చాయి
దీనిపై నిఘా పెట్టిన లాలాపేట పోలీసులు ఐదుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు
ప్రధాన నిందితుడు షేక్ కరీముల్లా. అతనితో పాటు షేక్ మాదర్ వలీ, షేక్ జాఫర్ సాదిక్, షేక్ మస్తాన్ వలి, మరో మైనర్ నిందితుడిని పట్టుకున్నారు. వీరంతా నల్లచెరువు, సంపత్ నగర్ నివాసులు.
నల్లపాడు, పాత గుంటూరు, పట్టాభిపురం, సత్తెనపల్లి పరిధుల్లో దొంగతనాలు చేశారు.
వీరి దగ్గర నుంచి 21 సుజుకి స్కూటర్లను రికవరీ చేసాము
వీటి విలువ సుమారు ₹20 లక్షలు.
దొంగిలించిన వాహనాలను తురకపాలెంలోని మధ్యవర్తి ద్వారా కంటైనర్లలో చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు తరలిస్తున్నారు





