బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించిన లక్ష 10వేలు కోల్ ఇండియాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు..
సింగరేణికి సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటిస్తుందని స్పష్టం చేశారు..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణికి ఎన్నడూ లేనంత భారీగా నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు..
పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క కొత్త కోల్ బ్లాక్ కూడా తీసుకురాలేదని, ఆక్షన్ జరుగుతున్నా టెండర్లలో పాల్గొనలేదని మండిపడ్డారు..
తాడిచెర్ల-2, నైని బ్లాకులను కాంగ్రెస్ తీసుకొచ్చిందని తెలిపారు..
సింగరేణిలో 752 ఎక్స్టర్నల్ పోస్టులు, 2,437 కారుణ్య నియామకాలతో కలిపి మొత్తం 3,189 పోస్టులు భర్తీ చేశామన్న మంత్రి శ్రీధర్ బాబు..
30 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం రూ.40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నామని వెల్లడి..
కోల్ ఇండియాలో లేని విధంగా సింగరేణి కార్మికులకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా కల్పిస్తున్నామని స్పష్టీకరణ..
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించలేదని, మారుపేర్ల సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు..
అధికారంలో ఉన్న పదేళ్లు బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన బీఆర్ఎస్ కొత్త గనులను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు..
కేంద్రంతో సరైన సహకారం అందనప్పటికీ ప్రజా ప్రభుత్వం కొత్త బ్లాక్‌లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని స్పష్టం చేశారు..
సింగరేణి ఉద్యోగ నియామకాలు, కార్మికుల బీమా వివరాలను వెల్లడించిన మంత్రులు





