అమెరికాలో బంధువుతో బలవంతపు చాకిరీ.. సత్తారు వెంకటేష్ రెడ్డికి 50 నెలల జైలు

తోటి భారతీయుడైన బంధువుతో బలవంతంగా పని చేయించుకుని హింసించిన కేసులో సత్తారు వెంకటేష్ రెడ్డి (38)కి అమెరికా ఫెడరల్ కోర్టు 50 నెలల జైలు శిక్ష విధించింది..
అక్టోబరు 8న ఈ సంచలన తీర్పును వెలువరించిన న్యాయమూర్తి జాన్ ఎ. రాస్..
ఇంటి పనులు, కంపెనీ పనులు చేయిస్తూ.. సరిగ్గా చేయలేదంటూ విచక్షణారహితంగా దాడి చేయడంతో బాధితుడికి తీవ్ర గాయాలు..
ఇమిగ్రేషన్ పత్రాలు లాక్కోవడం, నిద్రపోనివ్వకపోవడం, ఆహారం–స్నానం–మరుగుదొడ్డి వినియోగాన్ని పరిమితం చేసిన వైనం..
తీవ్ర హాని, బెదిరింపులతో వెట్టిచాకిరీ, ప్రభుత్వ నిధుల చోరీ నేరాలను అంగీకరించిన వెంకటేష్ రెడ్డి..
రాష్ట్ర కోర్టు ఇప్పటికే విధించిన ఐదేళ్ల జైలు శిక్షతో పాటే ఏకకాలంలో అమలు కానున్న 50 నెలల శిక్ష..
బాధితుడికి పరిహారంతో పాటు ప్రభుత్వ విభాగాలకు నిర్దేశిత మొత్తాలను చెల్లించినట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడి..
ఇదే కేసులో నిఖిల్ పెన్మత్సకు 37 నెలలు, శ్రవణ్ పెనుమెచ్చకు 30 నెలల జైలు శిక్ష విధింపు.





