తుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆగస్టు క్రాంతి మైదాన్‌కు పిలుపు
ముంబైలో సామాజిక కార్యకర్త తుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
"మమ్మల్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ మా నిరసనను కొనసాగిస్తాం. ఈ మధ్యాహ్నం ప్రతి ఒక్కరూ ఆగస్టు క్రాంతి మైదాన్‌కు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని తుషార్ గాంధీ వ్యాఖ్య.
నేషనల్ కాలేజీ దగ్గర అదుపులోకి తీసుకుని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు.
మరోవైపు ఫిరోజ్ మిథిబోర్వాలాను అదుపులోకి తీసుకుని MIDC పోలీస్ స్టేషన్‌లో ఉంచిన పోలీసులు..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ Gyanesh Kumarను తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం (అక్టోబర్ 10, 2026) న్యూఢిల్లీలోని గోల్ డాక్ ఖానా రౌండ్‌ఎబౌట్ వద్ద నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో జరుగుతున్న నిరసనకు మద్దతుగా ముంబైలో ఈ ఆందోళన.
అదుపులోకి తీసుకున్నా నిరసన కొనసాగుతుందని, జాతీయ జెండా లేదా రాజ్యాంగ ప్రతితో మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్‌కు చేరుకోవాలని పిలుపు..
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పిస్తోందని స్పష్టం.





