జూబ్లీహిల్స్ వాసులకు ఊరట.. ముఫాఖమ్ జా కాలేజీ వరకు కొత్త స్టీల్ ఫ్లైఓవర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి ముఫాఖమ్ జా కాలేజీ వరకు స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1కు అనుసంధానంగా ప్రత్యేక ర్యాంప్ నిర్మాణం..
ఈ ప్రాజెక్టును ఇప్పటికే ఉన్న ఈపీసీ కాంట్రాక్టర్ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)కు అప్పగించనున్నారు.
కేబీఆర్ పార్క్ వద్ద గతంలో తలపెట్టిన టీవీ9, ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ ప్రాజెక్టులను రద్దు చేశారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్‌సీఐటీఐ (HCITI) ప్రణాళికను సవరించిన జీహెచ్‌ఎంసీ..
కొత్తగా ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ పరిశీలించారు.





