రూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సినిమా ఫక్కీలో భారీ చోరీ..
కాకినాడ నుంచి రావులపాలెం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఈ నెల 22న ఘటన..
మహారాష్ట్ర తానే జిల్లా కల్హేర్ వాసి జితేంద్ర సింగ్ రాజ పురోహిత్ నరసాపురంలోని దుకాణాలకు ఇచ్చేందుకు తీసుకెళ్తున్న రూ.3 కోట్ల విలువైన 2.5 కేజీల బంగారం చోరీ..
బాధితుడిని వెంబడిస్తూ బస్సు ఎక్కిన ఆగంతకుడు..
రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులతో గొడవపడి దృష్టి మళ్లించి.. కిటికీలోంచి బ్యాగును రోడ్డుపై కారుతో ఉన్న సహచరులకు విసిరివేత..
బ్యాంక్ సెంటర్‌కు వెళ్లాక బ్యాగు పోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..
బాధితుడు చెప్పిన వివరాలు, సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో చేజ్ చేసి సోలాపూర్ గ్యాంగ్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న రామచంద్రపురం పోలీసులు..
గోప్యంగా విచారించి నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..
గతంలో 24 కేసుల్లో 40.836 కేజీల బంగారం దోచుకున్న ఈ ముఠా.. వీరి నుంచి 8 కేజీల బంగారం రికవరీ.





