తమిళనాడులో పురుషుల మరణాలు పైపైకి

2025లో తమిళనాడులో 4,01,860 మంది పురుషులు, 2,91,347 మంది మహిళల మృతి..
మహిళల కంటే అదనంగా చనిపోయిన 1,10,513 మంది పురుషులు..
ఈ అదనపు మరణాల్లో 86 శాతం మంది 15 నుంచి 64 ఏళ్ల లోపు వారేనని వెల్లడి..
2023లో 1.10 లక్షలు, 2024లో 1.07 లక్షలుగా నమోదైన మరణాల వ్యత్యాసం..
15-24 ఏళ్ల విభాగంలో 9,167 మంది పురుషులు, 4,461 మంది మహిళలు మరణించిన వైనం..
25-34, 35-44 ఏళ్ల విభాగాల్లో మహిళల కంటే మూడు రెట్లు ఎక్కువగా పురుషుల మరణాలు..
రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, పొగాకు, మద్యం, గుండె, కిడ్నీ జబ్బులే ప్రధాన కారణాలు..
వేతనం కోల్పోతామన్న భయంతో కూలీలు ఆస్పత్రులకు రావడం లేదన్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సోమసుందరం..
2023లో దేశవ్యాప్త మరణాల్లో పురుషుల వాటా 60.6 శాతంగా నమోదు..
రాష్ట్రంలోని 6,93,207 మరణాల్లో 41 శాతం మాత్రమే వైద్యపరంగా ధ్రువీకరణ.. 59 శాతం మరణాలకు తెలియని కచ్చితమైన కారణాలు..
పని ప్రదేశాల్లో వైద్య పరీక్షలు, ఈవెనింగ్ క్లినిక్‌లు, రోడ్డు భద్రత, మానసిక ఆరోగ్య సేవలు విస్తరించాలని నిపుణుల సూచన.





