ఖైరతాబాద్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ టికెట్ ఎవరికి?

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో ఖైరతాబాద్‌లో మొదలైన పొలిటికల్ హీట్..
హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.. దానం పిటిషన్ కొట్టివేత..
2023లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి.. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడంతో వచ్చిన చిక్కులు..
ఉపఎన్నికకు తాను సిద్ధమేనంటూ ఇప్పటికే స్పష్టం చేసిన దానం నాగేందర్..
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయారెడ్డి, పార్టీ నేత రోహిన్ రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
⠀
సామాజిక సమీకరణాల చర్చలో మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరు సైతం వినిపిస్తోంది.
దానం అనుభవానికే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందా? కొత్త అభ్యర్థిని ఎంచుకుంటుందా? ఖైరతాబాద్‌లో ఇప్పుడు ఇదే రాజకీయ ఆసక్తి. అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ముమ్మరంగా సాగుతున్న చర్చ





