వందేభారత్ రైలులో షాకింగ్ ఘటన.. వడలో భారీ ఇనుప బోల్ట్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బెంగళూరు నుంచి బెళగావికి వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. రైలులో అందించిన అల్పాహారంలోని వడలో పెద్ద ఇనుప బోల్ట్ కనిపించినట్లు ప్రయాణికుడు వెల్లడించారు.
ఆహార నాణ్యత, ప్రయాణికుల భద్రత విషయంలో ఇది తీవ్రమైన నిర్లక్ష్యమని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
ఈ ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి స్పందించి, ఆహార సరఫరాలో లోపాలను సరిదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఘటనపై రైల్వే అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.





