మలేషియా వీసా-ఫ్రీ ప్రవేశం రద్దు.. భారతీయులకు తప్పనిసరి వీసా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మలేషియా వెళ్లే భారతీయ పర్యాటకులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2026 డిసెంబర్ 31తో వీసా-ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు మలేషియా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.
2027 జనవరి 1 నుంచి మలేషియాలో అడుగుపెట్టే భారతీయులు తప్పనిసరిగా వీసా పొందాలి.
2026 డిసెంబర్ 1 నుంచి అధికారిక మైవీసా పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు.
జనవరి 1, 2027 తర్వాత ప్రయాణించే వారు బయలుదేరడానికి ముందే వీసా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.





